- గతంలో ఒప్పందం జరిగిన 13 అంశాల్ని అమలు చేయాలి
- నిర్మాణ పనుల్లో 90 శాతం ఉపాధి కల్పించాలి
- క్లాస్-4 శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి
- ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
విశాఖ జిల్లా రాంబిల్లి వద్దనున్న నేవల్ ఆల్టర్నేటివ్ బేస్(ఎన్‌ఏఓబి)లో నిర్వాసితులు, మత్స్యకారులు వేలాదిమంది 18 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. కేంద్రం నిర్మిస్తున్న ఎన్‌ఏఓబి(నాబ్) ప్రాజెక్టు వల్ల 4800 ఎకరాల భూముల్ని కోల్పోతున్నారని, సముద్రతీరాన్ని, శారదా, వరహా నదుల ప్రాంతాలను, గ్రామాలనూ కోల్పోతున్నారని పేర్కొన్నారు. నేవల్ బేస్ నిర్మాణంలో పలు గ్రామాలకు చెందిన 472 కుటుంబాలను తరలించారని తెలిపారు. అక్కడ సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు దుర్భరంగా జీవించాల్సి వస్తోందని పేర్కొన్నారు. వారికి నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించలేదని, 2011లో ప్రభుత్వ అధికారులు, నిర్వాసితుల మధ్య ఒప్పందం జరిగినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. డ్రెడ్జింగ్ పేరుతో మత్స్యకారుల ఉపాధిని కూడా పోగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలు గ్రామాలను నేటికీ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించలేదని, వాటిని వెంటనే గుర్తించాలని కోరారు. నేవీ పరిసర ప్రాంతం చుట్టూ ప్రహరీగోడ నిర్మించడంతో 2000 ఎకరాలు భూములు ముంపునకు గురవుతున్నాయని, వాటినీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించాలని కోరారు. ఎన్‌ఏఓబి వల్ల నష్టపోయిన వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని అప్పటి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎ.కె.ఆంటోని సిపిఎం ఎంపి తపన్‌సేన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపాదన పంపలేదని పేర్కొన్నారు. 15 రోజుల్లో జెట్టీ నిర్మిస్తామని అప్పట్లో హామీనిచ్చినా ఇంతవరకు నిర్మించలేదన్నారు. ప్రస్తుతం తీరం వెంబడి 150 ఎకరాల భూముల్ని కలుపుకుని డ్రెడ్జింగ్ కోసం పైపులైను వేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ పనులు చేస్తున్న ఎల్‌అండ్‌టి, నవయుగ కంపెనీలు స్థానికులకు కూలీ పనులు కూడా ఇవ్వకపోవడంతో వారందరూ ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో ఒప్పందం జరిగిన 13 అంశాలను అమలు చేయాలని, ఉపాధి కోల్పోయిన వారికి పని కల్పించాలని, నిర్మాణ పనుల్లో నిర్వాసిత కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని మధు కోరారు. కొత్త కలువాల పల్లి, కొత్తపల్లి గ్రామాలను ప్రభావిత గ్రామాలుగా నోటిఫై చేయాలని, నిర్వాసిత కుటుంబాలకు ఎన్‌ఏఓబి నిర్మాణ పనుల్లో 90 శాతం ఉపాధి, క్లాస్-4 శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని సిఎంకు రాసిన లేఖలో కోరారు. అలాగే కేంద్రానికి నివేదిక పంపి నిధులు రాబట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.