sreenuraaz sreenuraaz Author
Title: 32మంది మత్స్యకారులు క్షణంలో బోటు ప్రమాదం...
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
 32మంది మత్స్యకారులు క్షణంలో బోటు ప్రమాదం నుంచి బయట బయటపడరు.. గత కొన్ని రోజులుగా  ఎన్‌ఎఒబి నిర్వాసితుల ధర్నా  ఈ సందర్భంగా బోటు ప...

 32మంది మత్స్యకారులు క్షణంలో బోటు ప్రమాదం నుంచి బయట బయటపడరు..


గత కొన్ని రోజులుగా ఎన్‌ఎఒబి నిర్వాసితుల ధర్నా ఈ సందర్భంగా బోటు పై తిరిగి వస్తూ ఉన్న సమయంలో శారదా నది కీ సముద్రం దగ్గర గా
ఎన్‌ఎఒబి నిర్వాసితుల ధర్నా (మోగా) దాటుతు ..చెరువు నీటి ప్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్లనా బోటు పెను ప్రమాదం తపింది
ఎన్‌ఎఒబినిర్వాసిత సమస్యలు పరిష్కరించాలని నాబ్‌ నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతంలో  బంగారమ్మపాలెం మత్స్యకారులు ధర్నా చేశారు. 2011లో అప్పటి కలెక్టర్‌ ఆధ్వర్యంలో అంగీకరించిన 13 అంశాల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మరలా సముద్రంలో పైప్‌లైన్‌ డ్రెజ్జింగ్‌ పేరుతో మత్స్యకారుల వేటకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. డ్రెజ్జింగ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.15 వేలు చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. వెంటనే షిప్పింగ్‌ జెట్టీలు నిర్మించాలని, వృత్తి కోల్పోయిన మత్స్యకార మహిళలకు పురుషులతో సమానంగా లక్ష రూపాయలు ప్యాకేజీ వర్తింపజేయాలని, పెండింగ్‌లో ఉన్న మేజర్‌ సన్స్‌, మేజర్‌ డాటర్స్‌ ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్థానిక తహశీల్దార్‌ వచ్చి మంగళవారం కలెక్టర్‌తో చర్చలకు రమ్మన్నారని, ధర్నా విరమించమని కోరారు.

దీనికి మత్స్యకారులు సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా విరమించేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారమ్మపాలెం ఎంపిటిసి రాజారావు, సిపిఎం మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి రాజారావు, సిహెచ్‌ కోదండరావు, బంగారమ్మపాలెం కాంగ్రెస్‌ నాయకులు ఉమ్మిడి రాంబాబు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.



Advertisement

 
Top