బంగారమ్మపాలెం (ఎస్.రాయవరం), న్యూస్‌టుడే:
గతంలో జరిగిన ఒప్పందంలోని 13 అంశాలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ బంగారమ్మపాలెం గ్రామస్థులు చేపట్టిన ధర్నా గురువారం కొనసాగింది. సుమారు వెయ్యి మంది ధర్నాలో పాల్గొని మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, వైకాపా నాయకులు, పలువురు వాకపాడు గ్రామస్థులకు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకూ సమాన ప్యాకేజీ అందజేయాలన్నారు. ఎన్‌ఏఓబీ తీసుకున్న మత్స్యకార సొసైటీలోని 101 ఎకరాల భూమికి బదులు మరో ప్రాంతంలో భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రెండు రోజుల్లో కలెక్టర్‌ను కలిసి మత్స్యకారుల సమస్యలను తెలియజేస్తామన్నారు. వైకాపా నాయకులు బొలిశెట్టి గోవిందరావు, లక్కోజు ఆదిమూర్తి, కొణతాల శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు రాజారావు, మాజీ సర్పంచులు కారే దుర్గారావు, కృష్ణ, ఎంపీటీసీ పూర్వ సభ్యుడు కొదండరావు, సీపీఎం మండల కార్యదర్శి సత్యనారాయణ, మత్స్యకార యువకులు సత్తిరాజు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు