Title:
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
Sunset at Bangarammapalam Beach Sunset time at Bangarammapalam Beach Sunset time at Bangarammapalam Beach Bangarammapalem Beach...
తరతరాలుగా కొన్ని వందల సంత్సరముల నుండి మా జీవనాధారం అయిన భూములు, నదులను దేశ రక్షణ కొరకు ఇచ్చినందుకు గర్వ పడుతున్నాము. మాకు గూడు, కూడు, గుడ్డనుండి దూరం చేయకుండా మా భాధను, నిన్సహాయతను ఆవేదనను మన్నించి విశాఖపట్నం జిల్లా కలక్టరు వారు, సంయుక్త కలక్టరు వారు, రెవిన్యూ డివిజనల్ అధికారి వారు, స్పెషల్ డెవ్యూటీ కలక్టరు వారు, మండల తహాశీల్దారు వారు, పోలీసు శాఖ వారు మాకు సహాయ సహకారంలు అందిస్తారని ఆశిస్తూ మా విన్నపములు విన్నవించుకొనుచున్నాము.
నౌకాదళ ప్రత్యమ్న్యాయకేంద్ర ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కోర్కెలు:
1. జెట్టి నిర్మాణము పూర్తి అయ్యేవరకు జీవన భ్రుతి నెలసరి 20,000/- చొప్పున చెల్లించాలి.
2. చేపలు అమ్ముకునే మహాళలకు పురుషులతో సమానంగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాలి.
3. మేజరు డాటర్స్ మరియు మిగిలిన మేజర్ నవకు ఏ రోజు నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారో ఆ రోజు నాటికి 18 సంవత్సరముల వయస్సుని పరిగణలోనికి తీసుకోవాలి.
4.ప్రతి కుటుంబానికి ఆర్ కార్డు జారీ చేస్తే శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి.
5.మత్స్యకారుల జీవనాధారమైన వరాహా, శారద నదులను స్వాధీన పరచుకున్నందుకుగాను ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలి.
6. డ్రెడ్జింగ్ పనులు తక్షణమే నిలిపివేయాలి, పనులు నిలిపివేయలేని యెడల చేపల వేట చేయుటకు వీలు కాదు కనుక డ్రెడ్జింగ్ పూర్తి అయ్యేంత వరకు నెలసరి భ్రుతి కల్పించాలి
7. కేంద్రీయ విద్యాలయము మరియు కేంద్రీయ ఆరోగ్యకేంద్రము నిర్మాణము తక్షణమే చేపట్టాలి. మరియు
అరోగ్యకేంద్రం నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు నేవీ హెల్త్ కార్డులు ప్రతి కుటుంబానికి జారీచేయాలి.
8. సోసైటీ భూమికి బదులుగా భూమిని కేటాయించాలి లేదా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూమికి
పరిహారం చెల్లించాలి.
9. లేబర్ కాంట్రాక్టు పనులు స్థానికులకే కేటాయించాలి.
10. స్థానిక యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి.
11. మత్స్యకార కుటుంబాల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఇతర కులస్తుల మహిళలకు కూడా గంపల ప్యాకేజీ వర్తింపజేయాలి.
12. వినహాయ వ్యక్తులు (వితంతువులు, వికలాంగులు, అనాధలు, 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు) కు
నెలకు 3,000/- చొప్పున పింఛను జీవితాంతం అందచేయాలి.
13. నిర్వాసిత గ్రామాలలో సామాజిక అభివృద్దికి మౌలిక వసతులు కల్పించాలి.
14. భూమిని కోల్పోయిన రైతుల భూములకు అప్పట్లో ఇచ్చిన పరిహారం చాలా తక్కువ మరియు భూమిని ఉపయోగించలేదు కావున కొత్త భూసేకరణ చట్టం ప్రకారం అదనం గా పరిహారం చెల్లించాలి.